Conducted Over 0 Social Welfare Programs since 2016

Donate Money

All Donations are exempted Under Section 80 G(5)(vi) of Income Tax Act 1961.

Donate Now

Registration Details

Trust Registration No: 277/2015-16
CSR Registration No: CSR00064975
80G(5) Registration No: CIT (E) BLR/12AA/R-131/AAQTS4020A/ ITO(E)03/VOL 2016-2017

Our Past Programs

Year 2020

సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానానికి లక్షానూట పదహారురూపాయల చెక్కు అందజేత - Held on December 29th
సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానానికి లక్షానూట పదహారురూపాయల చెక్కు అందజేత - Held on December 29th

దత్తజయంతిని పురస్కరించుకుని వేటపాలెం లోని కొత్తపాలెం రోడ్డులో గల దత్తక్షేత్రం అన్నదానానికి సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున దివంగత సీతారావమ్మా భర్త అయిన మద్దినేని ఆదినారాయణ దత్తక్షేత్రం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శాశ్విత విరాళం గా తన భార్య జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన సీతారవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షానూట పదహారు రూపాయల చెక్కు అందచేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో క్షేత్ర కన్వీనర్ ప్రమీలాదేవి, అధ్యక్షులు ప్రత్తి వేంకట సుబ్బారావు, కార్యదర్శి నున్నా శివప్రసాదరావు, సహాయ కార్యదర్శి కరణం మురళీకృష్ణ, కోశాధికారి గుర్రం రంగనాయకులు, మహిళవిభాగ్ మారుపోకల లక్ష్మీ,బండ్ల చంద్ర, కొల్లూరి గోపాలరావు,ఏం డీ వో నేతాజీ తదితరులు పాల్గొన్నారు.

Handed over the cheque amount of 5000Rs - Held on December 27th
Handed over the cheque amount of 5000Rs - Held on December 27th

On behalf of " Seetharavamma Memorial Charitable Trust" Our trust Joint Secretary Jeevan Daggupati handed over the cheque amount of 5000 rs today to Mr. P. Kishna Kishore ( Tapatopu Village, Kodavaluru Mandal, Nellore dist - AP) who needs very badly financial support for his medical expenses. We wish him a speedy recovery.

Handed over the cheque amount of 10000Rs - Held on December 22nd
Handed over the cheque amount of 10000Rs - Held on December 22nd

On behalf of " Seetharavamma Memorial Charitable Trust" handed over the cheque amount of 10000 rs today to Mr. Pawan Bharadwaj who needs very badly financial support for his medical expenses. We wish him a speedy recovery.

Handed over the cheque amount of 16000Rs - Held on December 27th
Handed over the cheque amount of 16000Rs - Held on December 20th

On behalf of " Seetharavamma Memorial Charitable Trust" we have given cheque amount of 16,000 rs on 20/12/2020 to Kumari. Bhavana.G who needs financial support to continue for her BSc nursing 3 rd year....Our trust supported financially for her education from last 5 years, and wants to continue the same support till the completion of her studies...We wish Kumari. Bhavana.G all the very best.

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా  పురస్కారాన్ని అందజేసిన నిర్వాహకులు - Held on December 10th
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందజేసిన నిర్వాహకులు - Held on December 10th

సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కు ఉత్తమ సేవా పురస్కారం. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందజేసిన నిర్వాహకులు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని హర్షిని డిగ్రీ కళాశాలలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన పలు సంస్థలప్రతినిధులను ఉత్తమ సేవలందించిన ప్రామిఖులను సేవా పురస్కారాలతో సత్కరించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని, మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని అన్నారు. న్యాయసేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం పౌర హక్కుల కోసం పని చేయడమేనని అన్నారు. ముఖ్యంగా యువత హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. కోటి సమయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు అండగా నిలిచి అన్నారు. విపత్కర సమయంలో ప్రజలకు సేవ చేసిన సంస్థలను సత్కరించుకోవడం సముచిత మన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్, ప్రజా గాయకుడునూక తోటి శరత్ బాబు, మానవతావాది సంఘ సేవకుడు మండల మురళి కృష్ణ, మహిళా ఉద్యమ నాయకురాలు తెళ్ళ అరుణ తదితరులను సేవ పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏపీ & తెలంగాణ రీజనల్ చైర్మన్ శ్రీ పులి శ్రీనివాస ప్రసాద్ , సౌత్ ఇండియా ఎడ్యుకేషనల్ డైరెక్టర్ కె వి ఆర్, ప్రకాశం జిల్లా మహిళా విభాగం చైర్మన్ మరియు లీగల్ చైర్మన్ కె. సౌజన్య ఒంగోలు రూరల్ చైర్మన్ కొల్లా స్వరూప, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు తదితరులు పాల్గొన్నారు . Our trust received Best service award yesterday from " Human Rights Protection Council Of India - Prakasam District. On behalf of trust Award received by Nukathoti. Sarath babu our Trust Vice President.

దివ్యాంగులకు మూడువేల చొప్పున ఆర్ధిక  సహాయం - Held on December 04th
దివ్యాంగులకు మూడువేల చొప్పున ఆర్ధిక సహాయం - Held on December 04th

ప్రతీ ఏడాది సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో దివ్యాంగులకు మూడువేల చొప్పున ఆర్ధిక సహాయకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈఏడాదికూడా ముగ్గురు దివ్యాంగులకు , కాలు దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తికీ కూడా ఆర్ధిక సహకారం అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ప్రసిడెంట్ నూకతోటి శరత్ బాబు, మరియు చింతలపూడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేద మహిళలకు దుప్పట్ల పంపిణీ - Held on November 14th
పేద మహిళలకు దుప్పట్ల పంపిణీ - Held on November 14th

పేద మహిళలకు దుప్పట్ల పంపిణీ రానున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామంలో పేద వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీపావళి, చిల్డ్రన్స్ డేనీ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు నూక తోటి శరత్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు కేకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షుడు శరత్ చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలుగా పేద విద్యార్థులకు, పేద మహిళలకు, అనాధలకు, సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఇంటికో మొక్క కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.డాక్టర్ నూక తోటి రవికుమార్, ఎన్ వి శేషయ్య, పవన్ కుమార్ శ్రీదేవి, జ్యోతి, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Distributed Grocery items to the needy people - Held on November 13th
Distributed Grocery items to the needy people - Held on November 13th

"Sometimes it takes only one act of kindness and caring to change a person's life"... "Carry out a random act of kindness, with no expectation of reward....A single act of kindness throws out roots in all directions, and the roots spring up and make new trees".On 13-11-2020 the occasion of world's kindness day a small support extended from "Seetharavamma Memorial Charitable Trust" Associated with "R Youth Foundation" Distributed Grocery items to the needy people in saluchintala, Kovuru, Nellore dist.. Thanks for " R Youth Foundation " Team for their support.

Books distribution to Master. Kaushik  - Held on  18th October 2020
Books distribution to Master. Kaushik - Held on 18th October 2020

"It's not about how much you do, but how much love you put into what you do that counts " an inspiring words by Mother Theresa.... Books distribution to Master. Kaushik studying in 4 th Std.

Laptop given to Kumari. Kiran S Rajaput  - Held on  15th October 2020
Laptop given to Kumari. Kiran S Rajaput - Held on 15th October 2020

Small Support extended for A Girl Studies: An educated girl has direction. She has hope. She will become a mentor to other girls. She will change the world... Laptop given to Kumari. Kiran S Rajaput from Rajasthan Studying 10 th class, Little Lily School, Mahalakshmi Layout, Bangalore. Kumari. Kiran S Rajaput now safely and comfortably attending her on-line classes from home. All the very best Kiran 👍

ప్రజాగాయకుడు శరత్ సమజసేవకుడిగా పదిమందికి స్ఫూర్తి  - Held on  9th September 2020
ప్రజాగాయకుడు శరత్ సమజసేవకుడిగా పదిమందికి స్ఫూర్తి - Held on 9th September 2020

ప్రజాగాయకుడు శరత్ సమజసేవకుడిగా పదిమందికి స్ఫూర్తిగా నిలిచాడు.మహిళాభ్యుదయసమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ. ప్రజాగాయకుడుగానే కాకుండా సమజాసేవకుడిగా నూకతోటి శరత్ బాబు అనేకసేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగానిలుస్తున్నాడని మహిళాభ్యుదయసమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ లోని మహిళాభ్యుదయసమితి నిర్వహస్తున్న హోమ్ లో కేకే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల్లో తమతో పాల్గొని తన అభ్యుదయగానంతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడన్నారు.తన జన్మదినం రోజున ఆర్భాటంగా కాకుండా సేవాకార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలవడం అభినందనీయమని అన్నారు.ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా గాయకుడిగానే కాకుండా,సమజాహితంకోరే వ్యక్తిగా శరత్ మంచి పేరు సంపాదించాడని,సమాజాహితం కోరే అనేక కార్యక్రమాలు నిర్వహించాడన్నారు.ఎన్ సిసి ఆఫిసర్ బొంతు ఆనందరావు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతోమంది కళాకారులకు చేయూతనిచ్చిన మంచి వ్యక్తి శరత్ అని అన్నారు.ఒంగోలు సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు మాట్లాడుతూ శరత్ గాయకుడిగాకాకుండా మానవతావదిగా తామెప్పుడూ అభిమానిస్తామని అన్నారు.ఈసందర్భంగా గాయకుడు శరత్ బాబు శ్రీదేవి లు హోమ్ కు నిత్యావసరవస్తువులు,ఫ్యాన్,కుర్చీలు బహూకరించారు.

బొమ్మరిల్లు విద్యార్థులకు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత  - Held on 5th September 2020
బొమ్మరిల్లు విద్యార్థులకు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత - Held on 5th September 2020

యలమంచిలి శ్రీకిరణ్, రాజ్యాలక్ష్మిల కుమార్తెలు సహస్య,సహన ల జన్మదినాన్ని పురస్కరించుకుని సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు బొమ్మరిల్లు అనాధాశ్రయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల విద్యావసరాల నిమిత్తం ఇరవై ఒక్క వేలరూపాయలు బొమ్మరిల్లు నిర్వాహకులైన రాజ్యలక్ష్మి,ఖాసీం లకు అందజేశారు.ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లానీటియాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ జి.కాత్యాయనీ దేవి కేక్ కట్ చేసి చిన్నారులకు అందజేశారు.ఈసందర్భరంగా నిత్యావసరవస్తువులైన బియ్యం,కందిపప్పు,నూనె తదితర వస్తువులను అందజేశారు.విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు.ఈసందర్భంగా కాత్యాయనీదేవి మాట్లాడుతూ తమ కుమార్తెల పుట్టినరోజు విద్యార్థులవిద్యకోసం ఆర్ధికంగా సహాకారం అందించిన యలమంచిలి శ్రీకిరణ్, రాజ్యలక్ష్మిలను అభినందించారు.ప్రతీఒక్కరూ ఆర్భాటాలకు పోకుండా సేవాకార్యక్రమాలు చెయ్యాలని ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు అన్నారు.సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఒంగోలు సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు అన్నారు.ట్రస్ట్ ఉపాధ్యక్షులు,ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.తమ విద్యార్ధులకు ఆర్థికసహకారం అందజేసినందుకు ట్రస్టు నిర్వాహకులకు,సహస్య,సహనల తల్లీదండ్రులైన యలమంచిలి శ్రీకిరణ్, రాజ్యలక్ష్మి దంపతులకు బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి,ఖాసీం లు కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా వృద్ధాశ్రమంలొ నిత్యావసరవస్తువులు వితరణ కార్యక్రమం 4th July 2020
మహిళా వృద్ధాశ్రమంలొ నిత్యావసరవస్తువులు వితరణ కార్యక్రమం - Held on July 4th

మద్దినేని సీతారావమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు సమతా మహిళా వృద్ధాశ్రమంలొ నిత్యావసరవస్తువులు వితరణ కార్యక్రమం నిర్వహించాం.సీతారావమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, సెయింట్ తెరిస్సా స్కూల్ ఎన్ సిసీ ఆఫీసర్ బొంతు ఆనందరావు,ఆశ్రమ నిర్వాహకులు అంకబాబు,తులసి తదితరులు పాల్గొన్నారు. Amma, I think of you in every moment of my life..But sometimes the pain becomes so heavy to control.. Life without you seems meaningless..and When you were alive your presence thaught me to live life in the moment without waiting for tomorrow. But After your death, your absence has Taught me to Live life like There is no tomorrow.. The brutal impact of your Absence has left me lifeless. It's been Since 11 years of my mother's demise and yet her memories remain constant in our heart..which will never fade away for ages apart. In the name of my mother "Seetharavamma" to uphold and cherish her memories we have been rendering memorable services through our Charitable trust 'SEETHARAVAMMA MEMORIAL CHARITABLE TRUST' to the people in need and in the remembrance of my mother, these services of ours will continue to last forever and ever. Love you Amma.....

ట్రస్ట్ తరపున పంపిన వైద్యానికి 10,000 రూపాయలు సహయం 17th April 2020
ట్రస్ట్ తరపున పంపిన వైద్యానికి 10,000 రూపాయలు సహయం - Held on 17th April 2020

కష్టానికి ప్రాంతీయ భేదాలు ఉండవు.తెలంగాణకు చెందిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన ఉద్యమకారుడిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ కుమారుడు నిండా పదేళ్లుకూడా లేని గౌతమ్ కాళోజీ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వైనాన్ని హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త వాణీఉద్యమ గారు సోషల్ మీడియాద్వారా తెలియజేయింది. బాలుడి దీన గాధకు స్పందించిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మద్దినేని శాంతమ్మ గారితో సంప్రదించి, ట్రస్ట్ తరపున 10,000 రూపాయలు గౌతమ్ కాళోజీ తండ్రి శ్రీనివాస్ గౌడ్ ఎకౌంటకు ట్రాన్సఫర్ చేసాం.ట్రస్ట్ తరపున పంపిన ఈచిన్నసహయం ఆబిడ్డ వైద్యానికి సంభందించి దేనికో దానికి ఉపయోగ పడొచ్చు .ఆబిడ్డ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ఆబిడ్డ ఆరోగ్యంకోసం స్పందించి సహకరించేవారికోసం వారి ఎకౌంట్ నెంబర్ జతచేస్తున్నాను. చూసినవారు షేర్ చేస్తే ఎన్ని హృదయాలు స్పందిస్తాయో..నూకతోటి శరత్ బాబు (ప్రజాగాయకుడు) ఉపాధ్యక్షులు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్.

ట్రస్ట్ తరపున 25 పేదకుటుంబాలకు సహయం 8th April 2020
ట్రస్ట్ తరపున 25 పేదకుటుంబాలకు సహయం - Held on 8th April 2020

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ప్రకటించిననేపద్యంలో ఎంతోమంది పేదప్రజలు తిండి లేక అల్లాడుతున్నారు.ఈసందర్భంగామద్దిపాడుమండలం కొలసనకోటలోని 25 పేదకుటుంబాలకు సీతారావమ్మమెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్,మరియు మరికొంతమంది తోడ్పాటుతో ఒక్కోకుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందజేయ్యడం జరిగింది.ఈకార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు రెవరెండ్ ఫాదర్ ఇరుదయరాజ్,ఫాదర్ జగన్,NCC ఆఫిసర్ బొంతు ఆనందరావు కన్నాబాలశౌరి ,నాగినేని రామాంజనేయులు,పీవీ. నారాయణ,A. రవిరాజేంద్రకుమార్, జె ఎంబీ జె సిస్టర్,డాన్ బాస్కో ఫాదర్ తదితరులు పాల్గొన్నారు.

ట్రస్ట్ తరపున 25 పేదకుటుంబాలకు సహయం 3rd April 2020
ట్రస్ట్ తరపున 50 పేదకుటుంబాలకు సహయం - Held on 3rd April 2020

సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం కందిపప్పు పంపిణీ.రోజు రోజుకు విజ్రంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధికారణంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ కారణంగా ఉపాధికోల్పోయి అర్ధాకలితో అలమటిస్తున్న ఒంగోలులోని మోటూరి ఉదయం కాలనీకి చెందిన 50 కుటుంబాలకు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున బియ్యం,కందిపప్పు పంపిణీ చేశారు.ఈకార్యక్రమం స్థానిక సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈకర్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయుని డి.భారతిదేవి,శేఖరరెడ్డి,రెవరెండ్ ఫాదర్ ఇండ్లూరి ఇరుదయరాజ్,నేలటూరి తెరీసమ్మ ,NCC ఆఫీసర్ బొంతు ఆనందరావు లు సహకారం అందజేశారు.ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు,ఫాదర్ జగన్,సీపీఎం నాయకులు కొండారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం - Held on 8th March 2020
సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం - Held on 8th March 2020

A beautiful woman draws strength from troubles, smiles during distress and grows stronger with prayers and hope. Congratulations and Happy women's day all of us..సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం. Women are a symbol of strength. They are the finest creation of God,Be a queen when you think, be a queen when you decide, no one has the power to defeat the tremendous power inside a woman! Happy Women’s day 2020 to all of us.సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్టలో ని ZP హైస్కూలు లో సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం ఘనంగా జరిగింది.సత్కారం అందుకున్న వివిధ రంగాల్లోని విశిష్ట మహిళలకు ట్రస్ట్ తరపున అభినందనలు.ఈసందర్భంగా పదవ తరగతి విద్యార్థినిలకు డిస్టనరీ లు పంపిణీ చేయడం జరిగింది.

Handed over the cheque amount of 5000 Rupees - Held on 8th March 2020
Handed over the cheque amount of 5000 Rupees - Held on 8th March 2020

"It's not about how much you do, but how much love you put into what you do that counts " an inspiring words by Mother Theresa.... On the occasion of International women's day we are very happy to extend a helping hand to needy women Chandana P who is a single parent of two children ....Trust members handed over the cheque amount of 5000 rupees and she will use the same Education purpose of her children.

పెయింటర్ నూకతోటి వెంకటేశ్వర్లు కు ఐదువేల ఆర్ధిక సహాయం - Held on 19th February 2020
పెయింటర్ నూకతోటి వెంకటేశ్వర్లు కు ఐదువేల ఆర్ధిక సహాయం - Held on 19th February 2020

అనారోగ్యం కారణాలవల్ల ఎడమకాలు కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సంతనూతలపాడు మండలం,పెర్నమిట్టగ్రామనికి చెందిన సీనియర్ పెయింటర్ నూకతోటి వెంకటేశ్వర్లుకు బెంగుళూరుకు చెందిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు పంపిన ఐదువేల రూపాయల చెక్కును, ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు, ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు ,సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షులు కొల్లా మధు అందజేశారు. ఈసందర్భంగా వస్త్రాలను అందజేసిన మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతో ఎంతోమంది యువతకు పెయింటర్ వృత్తి ని నేర్పించి వారి ఆర్ధిక స్వావలంభనకు తోడ్పడిన వెంకటేశ్వర్లు కాలు కోల్పోవడం దురదృష్టం అని అన్నారు.కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు తాను సహకరిస్తానని,ట్రస్టు ద్వారా ఎంతోమంది అన్నార్తులకు సహకారం అందజేస్తున్న సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలిపారు.

Great time with children - 16th February 2020

Play is the highest form of research.... Children need the freedom and time to play.. Play is not a luxury... Play is a necessity... Make it simple. Make it memorable. Make it inviting to look at. Make it fun to read. Great time with children from 4.30 pm to 6.00 pm. All children Well played and very very happy....

విద్యార్థినిలకు జరిగిన అవగాహనాసదస్సు - Held on 13th February 2020
విద్యార్థినిలకు జరిగిన అవగాహనాసదస్సు - Held on 13th February 2020

బాలికలు బాలురతో ఇందులోనూ తీసిపోనివిధంగా రూపొందాలని మహిళా న్యాయవాది జాజుల మాధురి అన్నారు. సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో సెయింట్ తెరిస్సా ఉన్నతపాఠశాలలో విద్యార్థినిలకు జరిగిన అవగాహనాసదస్సులో విద్యార్థినులు - జీవిత లక్ష్యాలు అనే అంశం పై ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు .పాఠశాల తరగతుల్లోనే విద్యార్థినులు భవితకు పునాదులు వేసుకునేలా తమ నడవడికను తీర్చి దిద్దుకోవాలన్నారు.సమాజంలోని వింతపోకడలకు ఆకర్షితులు కాకుండా తల్లీదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకోవాలన్నారు.చిన్నవయసులోనే క్షణికాకర్షణల పట్ల ఆకర్షిలవుతూ బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేసుకుంటున్నారని,అలాంటి వ్యాసనాలభారినపడవద్దని హితవుపలికారు.తల్లిదండ్రులకు,గురువులకు భయపడని ఏ విద్యార్ధి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరని అన్నారు.ఈకార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెరిసమ్మ అధ్యక్షత వహించగా,కార్యక్రమాన్ని NCC ఆఫీసర్ బొంతు ఆనందరావు నిర్వహించారు.ప్రజాగాయకుడు,ట్రస్ట్ ఉపాధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు,ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు,సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లామధు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు నిర్మల మేరీ జ్యోతి,చెన్నూ,పద్మాలత, ప్రమీలాదేవి ,రవి రాజేంద్రకుమారు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాజులమధురిని సత్కరించారు.

Children program  - Held on  9th February 2020
Children program - Held on 9th February 2020

On 09-02-2020 from our trust "Children program" "Bhaghavad-Gita slokas " Learnt from 7 th chapter 1 st to 5 th Slokas...Chanting of 29 slokas from 5 th chapter (4.00 p.m to 5.00 p.m) few photos.

Children program  - Held on  9th February 2020
Children program - Held on 9th February 2020

On 09-02-2020 from our trust "Children program" Breathing exercises,Warm-ups, Yogasanas, Kapalbhati, Bhastrica Pranayama, Nadisuddi Pranayama, Om chanting done by cute Children few photos (5.00 p.m to 6.00 p.m).Distributed snacks for all the children.

బిడ్డవైద్యం కోసం 10,000 రూపాయలు ఆర్థికసహకారం - Held on 8th February 2020
బిడ్డవైద్యం కోసం 10,000 రూపాయలు ఆర్థికసహకారం - Held on 8th February 2020

ఇంట్లో చిన్నపిల్లలకు కాస్తంత సుస్తీ చేస్తే మనం తట్టుకోలేం.అలాంటిది ఆయాక్సిడెంట్ లో వెన్నెముకాదెబ్బతిని రెండుకాళ్లు చచ్చుబడి నిర్జీవంగా మంచమీదే ఉండే కన్నబిడ్డనుచూస్తే తట్టుకోవడం సాధ్యమా? కడపజిల్లా పొరుమామిళ్లకు చెందిన యలవర్తి శేఖర్ సుధారణీలు పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.కులాలు వేరుకావడంతో ఎవరి అండలేకపోవడంతో నెల్లూరులోని ఓ ప్రాంతంలో రోడ్డుపక్కగుడిసె వేసుకుని జీవిస్తూ బ్రతుకు వెళ్లదీసే శేఖర్ కు అనుకోని కష్టం వచ్చిపడింది.వేగంగా డ్రైవ్ చేస్తూ ఆమోతసైకిలిస్ట్ పనిమీదవెళుతున్న సుధారణిని, కుమారుడిని వెనకనుండి ఢీకొనడంతో బాబుకు వెన్నెముక దెబ్బతిని రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. మూలిగేనక్కపై తటికాయపడ్డ చందంగా కష్టాకొలిమిలో ఉన్న శేఖర్ సుధారణికి దారుణమైన కష్టం దాపురించింది.కటిక పెదరికంతోఉన్న వారికి బిడ్డవైద్యం ఓ పెనుసవాలు గామారింది.ఏది ఏమైనా బిడ్డను బ్రతికించుకోడానికి కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని రేయింబవళ్లు కష్టపడుతూ బిడ్డకు వైద్యం చేయిస్తున్నాడు. ఇప్పటికి లక్షలు ఖర్చుచేసినా నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నారు.సోషల్ మీడియాలో వీరి గాధను చూసిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మానవత్వంతో స్పందించి 10,000 రూపాయలు ఆర్థికసహకారం అందించారు.బిడ్డవైద్యం కోసం వైజాగ్ వెళ్లినవారి జాడ తెలుసుకుని వారికి ఈమొత్తాన్ని చెక్కు రూపంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు ,వారి మిత్రులు రామారావు ఇరువురూ కలిసి చెక్కురూపంలో అందజేశారు .దాతలు స్పందించి తగురీతిన ఆదుకుంటారని ఆశిస్తున్నాం. ఎవరైనా దాతలు మానవత్వంతో స్పందించి ఈ నెంబర్ కు ఫోన్ పే చెయ్యగలరు +91 90002 73171

Bhaghavad-Gita slokas - Held on 2nd February 2020
Bhaghavad-Gita slokas - Held on 2nd February 2020

On 02-02-2020 from our trust "Children program" "Bhaghavad-Gita slokas " Learnt from 6 th chapter 45 th to 47 th Slokas...Chanting of 29 slokas from 5 th chapter (4.00 p.m to 5.00 p.m) few photos.

Meditation to all the children - Held on 2nd February 2020
Meditation to all the children - Held on 2nd February 2020

As gold purified in a furnace loses its impurities and achieves its own true nature, the mind gets rid of the impurities of the attributes of delusion, attachment and purity through meditation and attains Reality.... Explained about importance and benefits of Meditation to all the children.. Regular practice of meditation how it will be useful for their studies explained.. Meditation done all the children inside the pyramid few photos.. Snacks distributed for all the children

అనారోగ్యంతో బాధపడుతున్న పేద విద్యార్థినికి పదివేల రూపాయలఆర్ధిక సహాయం - Held on 2nd February 2020
అనారోగ్యంతో బాధపడుతున్న పేద విద్యార్థినికి పదివేల రూపాయలఆర్ధిక సహాయం - Held on 2nd February 2020

ఒంగోలు సెయింట్ తెరిస్సా ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న పేద విద్యార్థిని చదలవాడ కుసుమకు బెంగుళూరుకు చెందిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పాఠశాల సిబ్బంది సంయుక్తంగా పదివేల రూపాయలు ఆర్థికసహాయం చేశారు.చదలవాడ కుసుమ చేయి, కాలు చచ్చుబడి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న వైనాన్ని ట్రస్ట్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ట్రస్ట్ సభ్యులు ఐదువేల రూపాయలు చెక్కు రూపంలో అందించగా,పాఠశాల NCC ఆఫీసర్ బొంతు ఆనందరావు తదితరులు ఐదువేల రూపాయలను పాఠశాల కరస్పాండెంట్ ఇండ్లూరి హృదయరాజ్ చేతులమీదుగా వారి పేరెంట్స్ కు అందజేశారు.కుసుమ ఆరోగ్యం కోసం మానవత్వంతో ఇతోధికంగా సహకరించిన ట్రస్ట్ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేసారు. ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు తమవంతు సహకరిస్తున్నామని ట్రస్ట్ ఉపాధ్యక్షుడు,ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు తెలిపారు.గతంలో కూడా పేదవిద్యార్థులకు సహకారం అందించడం జరిగిందన్నారు.కుసుమ అనారోగ్యంనుండి కోలుకుని బాగా చదువుకోవాలని ఆకాక్షించారు.ప్రధానోపాధ్యాయురాలు తెరిస్సా,విద్యార్థిని పేరెంట్స్ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

సూర్యసిరి దివ్యాన్గుల హాస్టల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ  - Held on 26th January 2020
సూర్యసిరి దివ్యాన్గుల హాస్టల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ - Held on 26th January 2020

గణతంత్రాదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాన్గులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు లోని సూర్యసిరి దివ్యాన్గుల హాస్టల్లో బియ్యం,కందిపప్పు,చక్కెర,వేరుశెనగ పప్పు తదితర నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ది కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతీఒక్కరూ తమకున్నదానిలో కొంత పన్నుల సేవకు హెచ్చించాలని,తద్వారా ఆకలితోఉన్న పేదలను అదుకున్నవారమవుతామన్నారు.ఇటువంటి సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు.ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు,NCC ఆఫీసర్ బొంతు ఆనందరావు,హాస్టల్ నిర్వాహకులు SK సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

Bhaghavad-Gita slokas - Held on 19th January 2020
Bhaghavad-Gita slokas - Held on 19th January 2020

On 19-01-2020 from our trust "Children program" "Bhaghavad-Gita slokas " Learnt from 6 th chapter 41st to 44 th Slokas...Chanting of 29 slokas from 5 th chapter (4.00 p.m to 5.00 p.m) few photos.

Free classes Art & Craft activity - Held on 19th January 2020
Free classes Art & Craft activity - Held on 19th January 2020

On 19-01-2020 from our trust "Children program" Free classes Art & Craft activity with basics Drawing, colouring & painting and Craft works from 5.00 p.m to 6.00 p.m few photos....Participated in this activity from the age group of 4 years to 14 years...All the children participated with lots of enthusiasm and learnt.Distributed snacks for all the children.

ఉషోదయా వృద్దాశ్రమం లోని వృద్ధులకు చీరలు, పిండివంటలు పంపిణీ - Held on 16th January 2020
ఉషోదయా వృద్దాశ్రమం లోని వృద్ధులకు చీరలు, పిండివంటలు పంపిణీ - Held on 16th January 2020

పండుగ నాడు నిరాదరణకు గురైన వృద్ధుల కళ్ళల్లో ఆనందభాష్పాలు చూస్తే గుండెల్లో మెలిపెట్టే ఎదో తెలియని బాధ.మనుమళ్లు, ముని మనుమళ్లతో హాయిగా గడపాల్సిన సమయంలో వృద్దాశ్రమాల్లో మగ్గుతున్న వేలాది మంది వృద్దుల్లో వీళ్ళు ఒకరు.సంక్రాంతి పండుగ సందర్భంగా సీతారావమ్మ మెమోరియల్ చారిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు ఉషోదయా వృద్దాశ్రమం లోని వృద్ధులకు చీరలు, పిండివంటలు పంపిణీ చేసాము.ట్రస్ట్ ఫౌండర్ శాంతమ్మ గారు స్వయంగా ఈకార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా కొల్లామధు,పద్మ ,మారేళ్ళసుబ్బారావు రాజేశ్వరి కుమార్తె కావ్య,బొంతు ఆనందరావుసువర్ణ దంపతులు ఈకార్యక్రమంలో పాల్గొని మద్దినేని శాంతమ్మ గారిని సత్కరించారు.తల్లిపేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు.

Become a Member or Volunteer